Tuesday 5 April 2011

Yoga tips.... in Telugu


ఆసనాలు
వజ్రాసనం 
వజ్రాసనం చేయు పద్ధతి: తొలుత సుఖాసన స్థితిని పొందాలినిటారుగా కూర్చోవాలి.రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి. 

త్రికోణాసనం చేయండిలా...! 
గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మీ దృష్టిని కుడిచేతివైపు ప్రస్తుతమున్న స్థితిలోనే అరనిమిషంనుండి ఒక నిమిషంవరకు దీర్ఘశ్వాసక్రియతో ఉండాలి. తర్వాత యధాస్థితికి చేరుకోవాలి. ఇదే రకంగా సమస్థితిలోకి వచ్చి కుడివైపు కూడా చేయాలి. 

వృక్షాసనం చేయండిలా...! 
వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి ఎడమ కాలును మోకాలు వద్ద వంచి ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి. గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి 

శుప్తవజ్రాసనం 1.ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.2.కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి. 3.మోచేతి భాగం నుంచి చేతి వ్రేళ్ల వరకు నిటారుగా ఉంచి నెమ్మదిగా శరీరాన్ని వెనుకకు వంచాలి.4.ఇప్పుడు భుజాలు నేలను తాకుతూ ఉండాలి. ప్రాధమిక దశలో ఉన్నవారైతే రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చేతులను మోకాలివరకు సమానంగా తీసుకురావాలి.5.ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద... అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి.6.తిరిగి వాస్తవిక స్థితికి వచ్చే సమయంలో, మొదటగా రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. 7.తర్వాత మోచేతుల సాయంతో తొలుత ఉన్న స్థానానికి నిదానంగా వచ్చేయాలి. 

పద్మాసనం నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా ఉంచాలి. కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి.వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను నమస్కార స్థితిలోను లేదా ఒకదానిపై మరొక చేతిని కలిపి ఉంచే స్థితి లేదా అరచేయి భాగం పైకి కనపడేలా రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి ఉండే స్థితి లేదా మోకాళ్లపై రెండు చేతులను విశ్రాంతి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు.. రెండు అరచేతులు పైకి కనపడేలా లేదా రెండు అరచేతులు కిందకు చూచేలా ఉంచవచ్చు లేదా మోకాళ్లపై చేతులు ఉంచి బొటనవేలితో చూపుడు వేలును తాకించి మిగిలిన వేళ్లను అలాగే నిటారుగా ఉంచాలి. 

కటి చక్రాసనంతో అదనపు కొవ్వు మాయం చదునైన నేలపై నిటారుగా నిలబడాలి. తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి. చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి. అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి. ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి.అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు చేయాలి. ఇలా కనీసం 5 మార్లు చేయాలి. 

పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి. భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి. తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి. ఇది సూర్య నమస్కారంలోని 3వ దశను తలపిస్తుంది. మెల్లగా గాలి పీల్చుతూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి. మెల్లగా చేతలు, తలభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలి. 

శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సౌధాన్లో నిలబడడం) రెండు కాళ్ళను ఒకదానికొకటి దూరం జరపాలి. అంటే విశ్రామ్‌లో నిలబడడమన్న మాట. కుడి చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి. అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి. అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి. భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి. అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు ఎడమవైపుకు వంచాలి. అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి. 

తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం చదునైననేలపై పాదాలలోని మడమల నుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు రెండు లోపలివైపుకు అభిముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలి. మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర విన్యాసస స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెళ్ళగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి. 

పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం చదునునైన నేలపై బోర్ల పడుకోవాలి.తల, మెడ, గడ్డం, ఛాతీ తొడలు, మోకాళ్ళను ఏకకాలంలో వెనుకకు లేపాలి.గడ్డాన్ని నేలపై నుంచి మెల్లగా లేపాలి. అదే సమయంలో శరీర కింది భాగాన్ని, తల, మెడను ఊర్ధ్వముఖంలో లేపాలి. మోకాళ్ళు, పాదాలు దగ్గరగా ఉండేలా చూడాలి. చూపుపైకి ఉండాలి. తల వీలైనంతగా వెనక్కు లేపాలి. చీలమండను బలంగా లాగాలి. చూపు చక్కగా ఉండాలి.శరీరమంతా కూడా నాభిపై సమతుల్యంగా ఉండేలా చూడాలి.సాధ్యమైనంత వరకు శరీరాన్ని విల్లు రూపంలోకి తీసుకురావాలి. ఈ దశలో గాలి పీల్చుకోవడం ఆరంభించాలి. తొడలు, ఛాతీ, కటిలు నేలను తాకరాదు. సాధ్యమైనంతగా పైకి చూడాలి. విన్యాసంలో ఇది చివరి దశ అవుతుంది. కాళ్ళు, భుజాలు నొప్పిగా అనిపిస్తాయి. భుజాలు సాగదీసినట్లుగా ఉంచాలి. కాళ్ళు కిందకు జారకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఈ దశను మరింతగా పొడిగించాలి. ఈ దశలో కనీసం 5 సెకనులు ఉండాలి. ఎక్కువగా కష్టమనిపిస్తే గాలి వదులుతూ ఆసనం నుంచి బయటకు రావాలి. 



పద్మాసన భంగిమ
తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే భంగిమ లేక స్థితి అంటారు. ఆసనాలు ప్రారంభించే ముందుగా.. నేల మీద చాపను గాని మందపాటి కాస్తంత మెత్తటి వస్త్రాన్ని పరుచుకోవాలి.

చేయు పద్ధతి : 
నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా ఉంచాలి. కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి.

వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను నమస్కార స్థితిలోను లేదా ఒకదానిపై మరొక చేతిని కలిపి ఉంచే స్థితి లేదా అరచేయి భాగం పైకి కనపడేలా రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి ఉండే స్థితి లేదా మోకాళ్లపై రెండు చేతులను విశ్రాంతి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు.. రెండు అరచేతులు పైకి కనపడేలా లేదా రెండు అరచేతులు కిందకు చూచేలా ఉంచవచ్చు లేదా మోకాళ్లపై చేతులు ఉంచి బొటనవేలితో చూపుడు వేలును తాకించి మిగిలిన వేళ్లను అలాగే నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు : 
మెదడుకు ప్రశాంతత.
శరీరం తేలికవుతుంది.
మోకాళ్లు, చీలమండలు విస్తరిస్తాయి.
దిగువ శరీరంలోని వెన్ను చివరిభాగం, వెన్నెముక భాగం, పొత్తికడుపు వంటి మొదలైన భాగాల్లో చైతన్యాన్ని కలిగిస్తుంది.

జాగ్రత్తలు :
చీలమండ గాయం అయ్యే అవకాశం.
మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు ఆస్కారం. 

వజ్రాసనంలో రెండో పద్ధతి: 
ఈ పద్ధతిలో పైకి కనపడుతున్న పాదాలను ఆసనానికి ఇరువైపులా కాకుండా ఆసనానికి కింది భాగంలో మీరు చేర్చగలరు.
ఆ క్రమంలో కాలివేళ్లు ఒకదానిపై ఒకటి చేరగా కాలి మడమలపై మీరు కూర్చుంటారు.
ఊర్థ్వభాగానికి తిరిగిన కాలిమడమలకు చెందిన అంతర్ భాగాలపై ఆసీనులవుతారు.
మొదట ప్రస్తావించిన వజ్రాసనం పద్ధతిలో ప్రస్తావించినట్లుగా ఈ పద్ధతిలో ఆసనం నేలను తాకదు.
శ్వాస ప్రక్రియ యధాతధం.

ప్రయోజనాలు: 
తొడభాగాన గల అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
వెన్నెముకకు మంచి వ్యాయామం.
ఉదరసంబంధిత అవయవాల క్రియలను క్రమబద్ధీకరించును
వెన్నెముక సంబంధిత కండరాలకు బలాన్నివ్వడమేకాక.. శరీరకదలికలకు అనుగుణంగా కండరాలు పనిచేస్తాయి. 
కటి (శ్రోణి) సంబంధిత భాగాలు బలపడతాయి.
బిగుతుగా ఉన్న బంధకములు, కాలి వ్రేళ్ల కండరాలు, కాలి వ్రేళ్లకు మధ్య గల భాగము, చీలమండ భాగము, తొడ యొక్క పై భాగము (పిరుదులు) తదితర భాగాలు వదులగును

జాగ్రత్తలు: 
మోకాళ్ల నొప్పులు లేదా శరీరానికి గాయాలు తగిలినప్పుడు ఈ ఆసనం వేయకూడదు. 

Surya Namaskaram:-మళ్లీ మెల్లగా గాలి పీల్చుకుంటూ తలను వీలైనంత వెనుకకు వంచాలి. దాదాపు నడుము వరకూ శరీరాన్ని వెనక్కు వంచాలి. దీనిని భుజంగాసనం అంటారు. 
మెల్లగా గాలి వదులుతూ భుజాలను చక్కగా చేస్తూ తుంటి, తలను భుజాలతో సమాంతరంగా ఉండేలా పైకి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ పైభాగానికి విల్లులా కనిపిస్తుంది. 

మెల్లగా గాలి పీల్చుకుంటూ కుడికాలిని ముందుకు తీసుకురావాలి. చేతులు చక్కగా ఉంచుతూ తలపైకెత్తాలి. మెల్లగా గాలిబయటకు వదులుతూ కుడికాలును కూడా ఇదేవిధంగా ముందుకు తీసుకురావాలి. పాదాలు, చేతులను సమాంతరంగా తీసుకువస్తూ తల మోకాళ్ళను తాకేలా చూడాలి. 

మెల్లగా గాలి వదులుతూ భుజాలను పైకి లేపాలి. మెల్లగా తల వెనుకకు వంచాలి. తిరిగి నమస్కార స్థితిలోకి రావాలి. తరువాత మొదటి స్థితికి చేరుకోవాలి. ఇంతటితో ఒక రౌండ్ పూర్తవుతుంది. తిరిగి ఈ ఆసనాన్ని మళ్ళీ వేయాలి. 

జాగ్రత్తలు 
తుంటి జారినవారు, వెన్ను నొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేయకపోవడం మంచిది. వారు ఒకవేళ ఆసనాన్ని వేయాలనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. 

ఉపయోగాలు 
జీర్ణావయవాలు అన్ని ఉత్తేజితమవుతాయి. అవి చాలా చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చర్మంలో ఉన్న అసమానతలు, సమస్యలు తొలగిపోతాయి. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.వెన్నుపాములో మరింత మేలు జరుగుతుంది. అజీర్తి సమస్యలుంటే తొలిగిపోతాయి.

No comments:

Post a Comment